
గొల్లపల్లి( జగిత్యాల) నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఈనెల 28 నుండి జనవరి 6 వరకు జరుగు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, అంగన్వాడి టీచర్స్, ఐకెపి వివో ఏ లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లకు ప్రజా పాలన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా పాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలపై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సాయిబాబా, ఎంపీపీ నక్క శంకరయ్య, ఎంపీడీవో నవీన్ కుమార్, ఎంపీ ఓ సురేష్ రెడ్డి, ఎమ్మార్వో సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.