బయోచార్ తో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు
సంస్థ క్షేత్ర పరిశీలకులు చెల్కల యుగేందర్
ముత్తారం :- నేటి ధాత్రి
బయోచార్ తో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చునని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ బి సి ఐ కేశవ పూర్ ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు అన్నారు.ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో బుధవారం బయోచార్ తయారీ మరియు బయోచార్ ఉపయోగాల గూర్చి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆ సంస్థ క్షేత్ర పరిశీలకులు చెల్కల యుగేందర్,రాజశేఖర్ లు మాట్లాడుతూ బయోచార్ తయారీ చాలా సులువని రైతులు వారికి ఉన్న వ్యవసాయ భూమిలోనే ఒక గుంత తీసి వ్యవసాయ వ్యర్ధాలు,కట్టెలు కాల్చి ఆ తర్వాత వచ్చిన బొగ్గును పునరుత్పాదక వ్యవసాయంలో భాగంగా బయోచార్ ను పంట భూముల్లో చల్లడం వలన నేలలో కార్బన్ నిల్వలు,నీటి నిలుపుదలను,ప్రయోజనకరమైన నేలలోని సూక్ష్మజీవులను,జీవ నైట్రోజన్ స్థిరీకరణను పెంచుతాయని, నేల ఆరోగ్యం,సేంద్రీయ కర్బనం పెరిగి రైతులు అధిక దిగుబడులు గడించవచ్చునని వారు తెలిపారు.