దత్తత సహాయ కేంద్రం ఏర్పాటు అవగాహన.

దత్తత సహాయ కేంద్రం ఏర్పాటు అవగాహన.

కోదాడ, నేటి ధాత్రి:

మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోదాడ లో హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ దశరథ్ తో దత్తత సహాయ కేంద్రం ఏర్పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దశరథ మాట్లాడుతూ. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ దత్తత సహాయ కేంద్రం ఏర్పాటు అవగాహన ద్వారా హాస్పటల్ సిబ్బందికే కాకుండా ప్రజలందరికీ చట్టబద్ధ దత్తతపై అవగాహన అనేది వస్తుందని ఎవరైనా దత్తత కావాలంటే మహిళా శిశు సంక్షేమ శాఖను సంప్రదించి చట్ట ప్రకారం దత్తత తీసుకోవచ్చు అలా కాకుండా చట్ట వ్యతిరేకంగా దత్తత తీసుకుంటే అటువంటి దత్తతకు చట్టబద్ధత ఉండదని అట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి ప్రొటెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ. ఎవరైనా వారి పిల్లల సంరక్షణ చూసుకోలేని వాళ్ళు గాని పిల్లలు వద్దనుకున్నవారు పిల్లలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వదిలివేయకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ సూర్యపేట వారికి అప్పగించినట్టయితే ఆ పిల్లలకు రక్షణ సంరక్షణ అందించడం జరుగుతుంది అని తెలియజేశారు.
కోదాడ ఐసిడిఎస్ సూపర్వైజర్ పూజ మాట్లాడుతూ. పిల్లల దత్తత కావాలి అనుకున్న వాళ్లు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ గాని మీ పరిధిలో అంగన్వాడి టీచర్ గాని లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం సంప్రదించినట్లయితే చట్ట ప్రకారం దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఐసిడిఎస్ సూపర్వైజర్ పూజ, హాస్పిటల్ డాక్టర్స్ నర్సులు సిబ్బంది ఏఐడి ఎన్జీవో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version