ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.

ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.

సివిల్ ఆస్పత్రిలో పండ్లను పంపిణీ చేసిన భాజపా శ్రేణులు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను భాజాపా శ్రేణులు చిట్యాల మండల కేంద్రంలో బుదవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనబిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ పాల్గొని చిట్యాల సివిల్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల భారత రాజకీయ చరిత్రను తిరగరాసి, గాండీల కుటుంబాన్ని గాంధీలుగా మార్చుకుని చలామణి అవుతున్న వారి రాజకీయ పుటలను పెకిలించి భరతమాత ముద్దుబిడ్డగా..140 కోట్ల మంది భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా ఎదిగి..రాజకీయ జీవితాన్ని మార్చిన అపర చాణక్యుడు..ఆ భగవత్ స్వరూపుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. 2012లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలను చేపట్టినప్పటి నుండి భారత్ సంక్షేమమే లక్ష్యంగా..భారత ప్రజల క్షేమమే ధ్యేయంగా..అఖండ భారత్ నిర్మాణమే తన ఊపిరిగా భావిస్తూ..విశ్రాంతి లేని నాయకుడిగా..ఒక యువకుడి వలె రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ..భారత్ ప్రతిష్ఠతను ప్రపంచ దేశాల నలుమూలల వ్యాపింప చేస్తూ..దిగ్విజయంగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ దేశ చరిత్రను తిరగరాశాడన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య సుద్దాల వెంకటరాజ వీరు గజనాల రవీందర్ గుండ సురేష్ మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ చింతల రాజేందర్ నల్ల శ్రీనివాస్ రెడ్డి గోపగాని స్వామి అశోక్ చారి చెన్నవేని సంపత్ వీరస్వామి వివేక్ కదం రాజు సూర శ్రీకాంత్ కేంసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ సాదా సదానందం శ్రీహరి బుర్రి తిరుపతి కత్తుల ఐలయ్య గొప్పగాని రాజు మాదారం రాజు ప్రభాకర్ మార్తా అశోక్ సారంగపని తీగల వంశీ తదితరులు పాల్గొన్నారు.

మోడీ జన్మదినం..

మోడీ జన్మదినం..
రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం బిజెపి నాయకులు రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. నిజాంపేట మండలం లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిజెపి మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా సేవ చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా మోర్ఛ ప్రధాన కార్యదర్శి ఆకుల రమేష్, సిద్దు రెడ్డి, భాజా అంజయ్య, శ్రీనివాస్, అభిషేక్ రెడ్డి తదితర బిజెపి నాయకులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version