
అంగన్వాడీలో తల్లిపాల పట్ల అవగాహన
నర్సంపేట,నేటిధాత్రి:
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నర్సంపేట -4 అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్లభారతి ఆధ్వర్యంలో తల్లిపాల పట్ల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సెక్టార్ సూపర్వైజర్ రమ హాజరై మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే పాలను ముర్రుపాలు అంటారని వాటిని త్రాగించడం ద్వారా బిడ్డకు నిరోధకశక్తి వెంటనే అందుతుందని తెలిపారు. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డల ఆప్యాయత పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డను తయారుచేసిన వారవుతారన పేర్కొన్నారు.బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయ్యేంతవరకు ఎలాంటి పోతపాలు,సీసాపాలు ఇవ్వవద్దని ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే బాలామృతాన్ని బిడ్డకు తినిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ,అంగన్వాడీ టీచర్ గౌసియా, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు భాగ్య,అర్పి రజిత,ఆశ కార్యకర్త రమ,తల్లులు మౌనిక,సువార్త,అనూష,శ్రీలేఖ, అనిత,జ్యోతి, సుమలత,నాగజ్యోతి, సౌమ్య, వజ్రమ్మ, శోభ,రాజా తల్లులు పాల్గొన్నారు.