చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొత్తపెళ్లి రామచంద్రమూర్తి తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఉద్యోగులు ఇంకా ఉన్నత స్థాయిలో సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ దావవినోద వీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని వారిని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం సంతోషమని అన్నారు, అలాగే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ ఆడదంటే అబల కాదని సభలని అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మహిళా ఉద్యోగులను సన్మానించడం ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు, అనంతరం రాజకీయ రంగంలో రాణిస్తున్న మహిళా మణులైన ఎంపీపీ దావు వినోద వీరారెడ్డిని, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవిని సన్మానించడం జరిగింది. అలాగే ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులైన ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద,ఐకెపిసిసి రమణాదేవి, షీ టీం పోలీస్ మహిళా కానిస్టేబుల్ కోమల, పంచాయతీ కార్యదర్శి సరిత, అగ్రికల్చర్ ఏఈవో సన్నీ, ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ సింధు ,వెటర్నరీ అసిస్టెంట్ సుజాత, రెవెన్యూ శాఖ అటెండర్ సరస్వతి, చిట్యాల గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు పుల్ల సారమ్మ, కబడ్డీ జాతీయస్థాయి క్రీడాకారిణి సంజన,లను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రామ చంద్రమూర్తి, ఉపాధ్యక్షులు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి చింతల మహేందర్, కోశాధికారి వెల్దండ సత్యనారాయణ, సహకార దర్శి గుర్రం శంకర్, సలహాదారులు గజనాల మహేందర్, పుల్ల రవితేజ, చింతల రాజశేఖర్ చింతకింది శ్రీనివాస్, సామల ధనుంజయ, కోడెల సదానంద, బోల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు