
గుండాల ఎస్ఐ రాజశేఖర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
చలానా రాయితీ అవకాశం జనవరి పదో తారీకు వరకు మాత్రమే ఉన్న నేపథ్యంలో వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని, గుండాల ఎస్ఐ కిన్నెరా రాజశేఖర్ తెలిపారు.ఇటీవల నకిలీ వేబ్సైటు తో బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని జాగ్రత్త గా చెల్లింపులు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు పెండింగ్ చెల్లింపు విషయంలో ఎటువంటి సందేహం ఎదురైనా గుండాల పోలీస్ వారిని సంప్రదించాలని తెలిపారు.ఆన్లైన్లో మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసుకోవాలని తెలిపారు.