
"Auto Driver’s Son Cracks NEET"
ఆటో డ్రైవర్ కుమారుడికి నీట్ సీటు….
జహీరాబాద్ నేటి ధాత్రి:
తన ప్రిపరేషన్లో అన్ని అడ్డంకులను అధిగమించి, జహీరాబాద్ అల్గొల్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ లో స్కూల్, జూనియర్ కాలేజ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చదివిన విద్యార్థి ఎండి. ఉబేద్ మెడిసిన్ కు సెలెక్ట్ అయ్యారు. నీట్ పరీక్షలో 465 మార్కులు సాధించాడు. జహీరాబాద్ మండలం హెూతి(బి) గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకు నీట్ కౌన్సెలింగ్ మొదటి దశలో నాగర్ కర్నూల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిసిన్ సీటు సాధించాడు. ఓబేద్ తన ప్రయాణంలో సామాజిక, ఆర్థిక అడ్డంకులను ఎలా అధిగమించగలమో తన విజయం ద్వార నిరూపించాడు. సామాజిక అడ్డంకులను, విద్యలో బలమైన సంకల్పం, ఉత్సాహంతో కలను సాధించడానికి కృషి చేసారు. సమాజానికి సేవ చేయడానికి భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ కావాలని ఉబేద్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆరోగ్యమే సంపద అని అన్నారు. తన చిన్ననాటి స్నేహితులు, సహవిద్యార్థులు మరియు జహీరాబాద్లోని టీజీమ్రేస్ ఫ్యాకల్టీ సభ్యుల ప్రేరణ పొందానని ఓబెద్ తెలిపారు.తన కొడుకు నాగర్ కర్నూల్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంభిభిఎస్ సీటు పొందినందుకు చాలా సంతోషంగా ఉందని తండ్రి ఇబ్రహీం అన్నారు. కొడుకు విజయానికి నిరంతర మద్దతు, ప్రేరణ ఇచ్చినందుకు అధ్యాపకులకు, కార్యదర్శి బి. షఫియుల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ఉబెద్ 5వ తరగతి నుండి అల్గోల్ బాయ్స్-1లో, 12వ తరగతి వరకు టెమ్రేస్ లో చదివాడు.