భద్రాచలం నేటి ధాత్రి
భద్రతా నియమాలు పాటిస్తే ప్రాణాలకు ముప్పు తప్పే అవకాశం ఉంటుందని తప్పకుండా అందరూ హెల్మెట్ ధరించి, భారీ వాహనాలు నడిపేటివారు సీటు బెల్టు ధరించి ప్రయాణాలు సాగించాలని, రోడ్డు భద్రతా నిబంధనలు సూచనలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించాలని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు గుడి అడ్రస్సు, పర్ణశాల వెళ్ళు వారికి, పాపికొండలు వెళ్ళు వారికి, భద్రాచలం పరిధిలోగల చార్జీల వివరాలు తెలియజేస్తూ, రేట్ల పట్టిక విడుదల చేయడం జరిగినది ఈ క్రమంలో అధిక ధరలు వసూలు చేయరాదని ఆటో డ్రైవర్లకు, టాటా మ్యాజిక్ డ్రైవర్లకు భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య సూచనలు చేశారు…
రవాణా శాఖ 36వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా యూనిట్ ఆఫీస్ భద్రాచలంలో లైసెన్సుల కోసం, వాహన రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చినవారికి
అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని సీటు బెల్టు వినియోగించాలని భద్రత నిబంధనలు పాటించాలని, కారు ఓనర్లకు, టు వీలర్ యజమానులకు ఆటో డ్రైవర్లకు సూచనలు చేశారు.