Auto Drivers Fix Dangerous Potholes
ఆటో డ్రైవర్ల చొరవ: గుంతల పూడికతో ప్రమాదాలకు తాత్కాలిక విరామం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లో ఉత్తరగడ్డ కింద ఉన్న ప్రమాదకరమైన రోడ్డు గుంతలను స్థానిక ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, దాతలు కలిసి సొంత నిధులతో, శ్రమదానంతో పూడ్చివేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏర్పడిన ఈ గుంతల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ఐక్యతకు నిదర్శనం. అయితే, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
