ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి
-సమాచార హక్కు రక్షణ చట్టం-2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్.
వరంగల్ నేటిధాత్రి:
ప్రైవేట్ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరంకు ముందస్తుగానే అడ్మిషన్లు తీసుకుంటూ విద్యను వ్యాపారంగా మారుస్తూ లక్షల రూపాయలను పేద మధ్య తరగతి విద్యార్థుల నుండి కాజేస్తున్నారని వెంటనే జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాహుల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వేలు దాటి లక్షలకు చేరిందని, మేనేజ్మెంట్ కోట సీట్లకు యజమాన్యం చెప్పినంత ఫీజు విద్యార్థులు కట్టాల్సిందే లేదంటే నో అడ్మిషన్ అంటూ విద్యార్థుల జీవితాలపై ప్రైవేట్ విద్యాసంస్థలు చెలగాటం ఆడుతుందని తెలిపారు. జిల్లా రాష్ట్ర విద్యాధికారులు వెంటనే ముందస్తు అడ్మిషన్ల పేరుతో లక్షలు కాజేస్తున్న పలు ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఫీజు నియంత్రణ చట్టం రూపొందించకపోవడం, ముఖ్యమంత్రి విద్యార్థులపై శ్రద్ధ చూపకపోవడం వల్లే ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు కొన్ని సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు రాకపోవడం, ప్లీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను యజమాన్యాలు దౌర్జన్యంగా వారి వద్ద నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.