IMF Says India Is Key Driver of Global Economic Growth
సిద్దేశ్వర ఆలయంలో పూజా సామాగ్రి వేలంపాట: 17న వేలం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ సమీపంలోని శ్రీ సిద్దేశ్వర ఆలయంలో పూజా సామాగ్రి విక్రయానికి వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి. శివ రుద్రప్ప తెలిపారు. జనవరి 17న ఆలయం వద్ద వేలం జరుగుతుంది. పాల్గొనేవారు రూ. 25,000 డిపాజిట్ చేయాలి. వేలం ద్వారా ఎంపికైన వారు జనవరి 18 నుండి వచ్చే సంవత్సరం జనవరి 19 వరకు పూజా సామాగ్రిని విక్రయించుకోవచ్చు. ఇందులో కొబ్బరికాయలు, మంచి నూనె వంటివి ఉంటాయి. హిందూ విశ్వాసం ఉన్నవారే పాల్గొనాలి. వేలం దక్కించుకున్నవారు 50% సొమ్ము వెంటనే, మిగిలినది మూడు నెలల్లోపు చెల్లించాలి. నిర్దేశించిన సూచనల ప్రకారమే అమ్మకాలు జరపాలి.
