బిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన రాజాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి
లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాజపూర్ మండల నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు.
మంగలి యాదగిరి, మంగలి ఆంజనేయులు గార్లతో సహా దాదాపు 70 మంది సభ్యులు రాజపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న మండల ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నూతన సభ్యులకు ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం బాలానగర్ మండల కేంద్రంలో ని పెద్దయిపల్లి చౌరస్తా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో జరుగుతున్న పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా లక్ష్మారెడ్డి హాజరై,ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.