ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 100 మంది కాంగ్రెస్ మరియు బిజెపి కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,పార్టీ లో చేరిన వారిలో బిజెపి మండల మైనారిటీ సెల్ అద్యక్షులు మహమ్మద్ అజీమ్,జంపాల సుమన్,హనీఫ్,ఆఫ్రోజ్,పొన్న గోపాల్,తోట రవి, తదితరులకు కండువా కప్పిన ఎమ్మెల్యే ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్ రావు వైస్ చైర్మన్ గజ్జల శ్రీ రాములు,జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ,మండల పార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కంజర్ల రమేష్ ,స్థానిక ఎంపిటిసి రమేష్,ఉపసర్పంచ్ బొల్లం ప్రకాష్ ,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ పడిదెల సమ్మారావు,మైనారిటీ సెల్ అధ్యక్షులు అబ్బాస్ అలీ,గ్రామ పార్టీ అధ్యక్షులు యాకయ్య, ముఖ్య నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.