కెసిఆర్ చేస్తున్న అభివృద్ధికిఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరికలు..

#రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీకి విజయం తథ్యం.

#ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామానికి చెందిన బిజెపి మండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇట్టే నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోబి ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేమాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని చేరిన ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్ గౌడ్, సర్పంచులు తంగేళ్ల నిర్మల రవీందర్ రెడ్డి, వెంకన్న, ఎంపిటిసి ఏడాకుల రవీందర్, పార్టీలో చేరిన వారు గువ్వ సోమశేఖర్, గైని నవీన్, ఇట్టే మహేందర్ రెడ్డి, కాసర్ల సాంబ రెడ్డి, బోడ బిక్షపతి, జనగం రాజేందర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *