భద్రాచలం నేటి ధాత్రి
మీ పాలన మీద నమ్మకం ఉంటె రాజీనామా చేపించండి..
అభివృద్ధి కోసం తెల్లం పార్టీ మారితే తెచ్చిన అభివృద్ధి నిధులు ఏమిటో చెప్పాలి…
రేగా కాంతారావు
మాజీ ఎమ్మెల్యే. జిల్లా పార్టీ అధ్యక్షులు
భద్రాచలం
కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ గూoడాలు చేసిన దాడిని తీవ్రంగా కండిస్తున్నాను ….
ఇది అప్రజాస్వామ్యం ఇది పిరికిపందల చర్య దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాలేదని దేవుని కండువా అని మాట్లాడటం ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా సిగ్గుచేటు అని మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు..
మొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఇంటిపైన దాడి … ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వస్టే కారు పైన … దాడి చేసిన కాంగ్రెస్ గుండాల పైన ఎందుకు చట్టప్రకారం చర్య తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి …
పథకం ప్రకారం BRS నాయకులపై దాడిచేసుడు సిగ్గుమాలిన పని దీనికి కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలి ….
దాడులు మాకు చేతకాక కాదు మానాయకుడు ఆదేశిస్తే అగ్నిగుండమే … ఈ సిగ్గుమాలిన పనులవలన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది ……
అల్లర్లు జరుగుతే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా ….
పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ మళ్లీ కాంగ్రెస్ కుట్రలకు బలవుతుంది శాంతి భద్రతలు కాపాడలేని ప్రజాపాలన ఎందుకు ఇది రాష్ట్ర భవిషత్ కు మంచిది కాదు …
ఈ కాంగ్రెస్ గుండాల దాడులన్ని సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుచున్నాయి సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి …
రాష్ట్ర భవిషత్ కాంగ్రెస్ నాయకుల చేతిలో మల్లోసారి బలపుతుంటే చూస్తూ ఊరుకోం తగిన గుణపాఠం ప్రజాక్షేత్రంలో తెల్చుకుంటాము సీఎం కి దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే లను రాజీనామా చేపించి మళ్లీ గెలవండి చూద్దాం …
అధికారం ఎవరికీ సొత్తుకాదు భవిషత్ BRS పార్టీ దే దమ్ముంటే రాజీనామా చేపియ్యండి తేల్చుకుందాం …
మీ తాటాకు చప్పుళ్లకు BRS బయపడదు ప్రజాక్షేత్రంలో దేన్నైనా ఎదుర్కొనుటకు సిద్దంగా ఉన్నామని అన్నారు…
అభివృద్ధి కోసం తెల్లం వెంకట్రావు పార్టీ మారితే నియోజకవర్గ అభివృద్ధికి ఏమి నిధులు తెచ్చారో ప్రజలకు బహిరంగంగా తెలియపచాలని…అన్నారు
ఈ సమావేశంలో రావులపల్లి రాంప్రసాద్. మనే రామకృష్ణ. గోడవర్తి నర్సింహమూర్తి. సాగి శ్రీనివాసరాజు.ఆకోజు సునీల్ కుమార్. ఉడత రమేష్. దానియేలు ప్రదీప్. యువరాజు. ఐనాల రామకృష్ణ. ప్రకాష్. అనిల్ నాగరాజు. రాణి. ఏడుకొండలు తదితరులు ఉన్నారు