దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు

దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి..

దళిత సంఘాల నాయకులు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం లోని మాచారం గ్రామానికి చెందిన దళిత యువకుడు సర్వని జగన్ మాదిగ పై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు వారి అనుచరులు మాదిగ కులం పేరుతో దూషిస్తూ,కర్రలు రాళ్ళతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని ,నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
బాలానగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన సర్వాని జగన్ మాదిగ వారి తాత పేరిట అదే గ్రామంలో 200 గజాల స్థలాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది.అట్టి స్థలంలో ఇంటిని నిర్మించుకోవడం కోసం అక్కడికి వెళ్లి పరిశీలన చేసే క్రమంలో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుప్ప రమేష్, సుప్ప జెనర్ధన్, సుప్ప రాజేందర్, సుప్ప, సుప్ప దేవేందర్, సుప్ప దామోదర్, మరియు వారి అనుచరులు అక్కడకు వెళ్లి గ్రామ కంఠం భూమిలో మీరు ఎలా కడతారు అని దూర్భాషలాడుతూ, కులం పేరుతో దూషిస్తూ, పక్కనే ఉన్న కర్రలు రాళ్ళతో దాడి చేసి గాయాలపాలు చేసి మిమ్మల్ని ఎప్పటికైనా హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం జరిగిందని దళిత సంఘాల నాయకులు తెలిపారు.ఇట్టి విషయం తెలుసుకున్న ఎమ్మార్పిఎస్ మరియు దళిత సంఘాల నాయకులు దాడికి గురైన వ్యక్తులు సర్వని జగన్ మాదిగ ని పరామర్శించి మీడియా తో మాట్లాడుతూ, దాడికి పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చట్ట పరమైన చర్యలు తీసుకొని అన్నారు. భాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన ప్రోత్సహకం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో దళితులపై దాడులు చేస్తే ప్రతి దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చళ్ళ వినోద్ మాదిగ,అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఆరేళ్ళ యాదయ్య మాదిగ, ఎమ్మార్పిఎస్ రాజాపూర్ మండల అధ్యక్షులు నరిగే యాదయ్య,మట్టగాల్ల వెంకటయ్య తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లింగాల నర్సింలు ఎమ్మార్పీఎస్ విజయవాడ అర్బన్, చెన్నారం తస్తన్న గండేడ్ మండల్ దళిత నాయకుడు, పెరమళ్ళ సాయికుమార్ బాల్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ సర్వని రవికుమార్ ల్,శివ మాచారం శ్రీనివాస్ ,మల్లేష్ మార్ప్స్ తిరులళగిరి,దళిత సంఘాల నాయకులు పెరుమాళ్ళ జంగయ్య,సూరారం యాదయ్య,కొండకల్లా విష్ణువర్ధన్, యాదయ్యమాదిగ జేయంద్ర, దుర్గేష్ కిష్టని తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!