Dalit Attacks Increased Under Congress Rule: BRS
కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు
◆-: బీఆర్ఎస్ నేత బండి మోహన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరా బాద్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పలు గ్రామాలలో ఎస్సీలు తమకు ఓటు వేయలేదని అగ్రవర్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడం, దూషిం చడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. అగ్రవర్ణాలు దాడి చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, పోలీ సులు బాధితులపైనే కేసులు చేస్తామంటూ బెదిరించడం హేయమైన చర్యగా చెప్పారు. గ్రామస్తుడి ఇల్లు కూల్చేసిన సర్పంచ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన ఆధారాలు బాధితులు చూపించినప్పటికీ పోలీసులు పట్టించు కోకపోవడం దారుణం అన్నారు. జహీరాబాద్ పరిధిలోని సజ్జాపూర్, కప్పాడ్ గ్రామాలలో జరిగిన ఘటనలు పునరావృతమైతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
