
BJP Warns After Attack on Party Worker
బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.
హెచ్చరించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి.
చిట్యాల, నేటిధాత్రి ;
చిట్యాల మండలం లోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్ పై ఆగస్టు 15న జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్, ఆయన భార్యపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దాడులకు పాల్పడటం పూర్తిగా బలహీనత రాజకీయాలు అని నేతలు విమర్శించారు. ఇలాంటి దాడులు ప్రజలలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేవని, దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు.
దాడికి వెనుక ఉన్న పులి తిరుపతి రెడ్డి – పులి అంజిరెడ్డి గ్యాంగ్.
జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ –
ఈ దాడి వెనుక తిరుపతి రెడ్డి, పులి అంజిరెడ్డి అనుచరులే ఉన్నారని స్పష్టమవుతోంది. వారే కుట్ర పన్ని, తమ అనుచరులను ప్రేరేపించి బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్, ఆయన కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు.
తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లాభాల కోసం గ్రామంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ధైర్యం లేక భయపడి ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి అనుచరులు గ్రామ ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కడమే తమ రాజకీయ విధానంగా మార్చుకున్నారు. కానీ ఈ పద్ధతులు ఇకపై పనిచేయవని, ప్రజలు వారిని తిప్పికొడతారని నేతలు స్పష్టం చేశారు.
నిషిధర్ రెడ్డి గారి హెచ్చరిక
“గ్రామాల్లో బీజేపీకి విపరీతమైన ప్రజా మద్దతు లభిస్తోంది. ఈ పెరుగుతున్న శక్తిని తట్టుకోలేక ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు తాత్కాలిక లాభాల కోసం పార్టీలను మార్చే వారు కాదు. వారు దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే నిజమైన యోధులు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీలను చిన్న పిల్లలు ఆట వస్తువులు మార్చుకున్నట్లుగా మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సత్యనారాయణ అనుచరుడిగా మారి మా కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించడం ప్రజలు బహిరంగంగా గమనిస్తున్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా తన అనుచరులను అణగదొక్కే రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరం. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వహించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడమే ఆయన రాజకీయమైపోయింది.
ఇకనైనా మా కార్యకర్తలపై దాడులు జరిగితే బీజేపీ అస్సలు ఊరుకోదు. ప్రజాపరంగా, చట్టపరంగా గట్టి సమాధానం ఇస్తాం. ఇది మా చివరి హెచ్చరిక – ఖబర్దార్!” అని నిషిధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవికిరణ్
మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్టేకుమట్ల మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు చక్క నరసయ్య బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అశోక్ చారి బిస్కుల రవి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.