# ఎన్నారై, యూత్ ఫర్ స్వచ్ఛ్ దుగ్గొండి వ్యవస్థాపక అధ్యక్షులు శానబోయిన రాజ్ కుమార్
# గ్రామాల ప్రజలకు చెదోడు వాదోడుగా గ్రామీణ వైద్యులు.
నర్సంపేట,నేటిధాత్రి :
గ్రామాల్లో పేద ప్రజలకు ఆసరగా ఉంటూ ప్రథమ చికిత్సా సేవలు అందిస్తున్న ఆర్ఎంపి,పీఎంపీలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు, వైద్యాధికారులు చేస్తున్న దాడులు ఆపాలని ఎన్నారై ఫోరం యుకె అధికార ప్రతినిధి,యూత్ ఫర్ స్వచ్ఛ్ దుగ్గొండి వ్యవస్థాపక అధ్యక్షులు శానబోయిన రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికీ ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్య వచ్చిన ప్రజలకు చేదోడు వాదోడుగా వుంటూ వారికీ కావాల్సిన ప్రథమ చికిత్సను అందిస్తుంటారని రాజ్ కుమార్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పొడపరిచి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.గ్రామీణ ప్రాంతంలో వైద్యసేవలకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రథమ చికిత్సా అందించే గ్రామీణ ప్రాంత వైద్యులైన ఆర్ఎంపి,పీఎంపీలపై అధికారుల దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ, ప్రజలకు ప్రథమ చికిత్స అందుబాటులో ఉండే విదంగా చర్యలు తీసుకోవాలని రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని విన్నవించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా , తక్షణ ప్రధమ చికిత్స అందుబాటులో ఉండే విదంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న అర్హులైన ఆర్ఎంపి,పీఎంపీలపై లను గుర్తుంచి వారికీ తగిన శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పరంగా వారిని సర్టిఫై చేసి ప్రజలకు సేవ చేసే విదంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వారి డిమాండ్ లను పరిగణించి న్యాయం చేయాలని రాజ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.