– రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంకిటి తిరుపతిరెడ్డి
రామడుగు, నేటిధాత్రి:
జర్నలిస్టు శంకర్ పై గుండాలు చేసిన దాడి హేయమైన చర్య అని రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులపై దాడులు చేయడం పిరికి పందల చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం మంచి సంస్కృతి కాదని అన్నారు. జర్నలిస్టు శంకర్ పై దాడికి పాల్పడిన నిందితులపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల జిల్లా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.