
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై నూతన భవన ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్ చేసినూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రికేయులు అంటే ఎంతో నియమా నిబంధనలతో పనిచేస్తూ బయట జరిగే విషయాలను నిర్భయంగా నిజం రాసిన పత్రికల పట్ల ప్రభుత్వం ఇప్పటికి అండగా ఉంటుందని భవిష్యత్తులో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పాత్రికేయ మిత్రులను పట్టించుకోలేదని తమ ప్రభుత్వం పాత్రికేయులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నచో తమ దృష్టికి తీసుకు వస్తే పెద్దల దృష్టికి ఆ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన భవన నిర్మాణానికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని తెలియజేస్తూ పెద్దలు ప్రజా ప్రతినిధులు తమ వంతుగా వారి నిధులనుండి సహాయం చేశారని ఇకముందు కూడా క్లబ్ కి సంబంధించి ఏమైనా అవసరం ఉండొచ్చు ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మంజుల లింగారెడ్డి ఎంపీపీ రాజు మానస పాక్స్ చైర్మన్ వైస్ చైర్మన్ సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంజనేయులు పాలకవర్గ సభ్యులు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు