Kaleemuddin Files Nomination as Atnur Sarpanch Candidate
అత్నూర్ సర్పంచ్ అభ్యర్థి మొహమ్మద్ కలిముద్దీన్ నామినేషన్ దాఖలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల
అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మొహమ్మద్ కలిముద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. మొహమ్మద్ యునుస్ గ్రామ పెద్దలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు.సహాయ సహాకారాలతో అత్నూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ లక్ష్యమని నాయకులు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మొహమ్మద్ కలిముద్దీన్ వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
