Financial Aid for Families of Deceased Teachers
మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు సహాయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
గురువారం, ఇటీవల మరణించిన నలుగురు పిఆర్టియు ఉపాధ్యాయుల కుటుంబాలకు సంక్షేమ సంస్థ తరపున జిల్లా అధ్యక్షుడు మణయ్య లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దిగ్వాల్- విజయలక్ష్మి, చింతల్ చెరు- నీరజ, చాప్ట(కే ) – శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్- సుజాత కుటుంబ సభ్యులకు ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
