Assembly Tiger Onkar 17th Death Anniversary Commemorated
అసెంబ్లీ టైగర్… ఓంకార్ 17వ వర్ధంతి సభ
ఎం సి పి ఐ యు, ఏఐ సి టియుసి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం జ్యోతిరావు పూలే సెంటర్లో ఎంసిపిఐయు పార్టీ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ వర్ధంతి సభను ఎం సి పి ఐ యు- ఏఐసిటియు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలను వెన్ను ఎల్లయ్య, బొల్లోజు రామ్మోహన చారి లు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు -ఏఐసీటియు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ ఓంకార్ భూమి కోసం, భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములపై, పెత్తందారులపై ,నిజాం దొరలపై పోరాడిన ధీరుడు అని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఓంకార్ అని ఆయన కొరియాడారు. పేదల పక్షపాతి ప్రజా సమస్యలపై ధారాళంగా గలమెత్తిన ఆయనను అసెంబ్లీ టైగర్ అని పిలిచేవారని ఆయన అన్నారు.ఓంకార్ ఐదు సార్లు నర్సంపేట నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన మీద కత్తిపోట్లు ,నాటు బాంబులు, తుపాకి తూటాలకు గురైన మృత్యుంజయడని ఆయన అన్నారు.ఓంకార్ శ్రామికుల శ్రమజీవి, బహుజనుల స్వప్నం, పోరాటాల యోధుడు ఆయన నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శప్రాయుడని ఆయన అన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతంతో, కమ్యూనిస్టు ఆశయంతో,వామపక్షాల ఐక్యత, సామాజిక శక్తుల సమీకరణ నే కర్తవ్యం గా భావించినాడని ఆయన అన్నారు. ఆర్థిక ,రాజకీయ, సామాజిక, సమానత్వ సాధనకు సాధికారతకు ఆయన పోరాట గొంతు కానీ, శ్రామిక వర్గాల ఆశాజ్యోతి ,సమస్త ప్రజల సమానత్వమే ఆయన నినాదం అని ఆయన అన్నారు .ఆయన ఆశయ స్ఫూర్తితో నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేయాలని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ధారావతు రమేష్, నేరడ వీరస్వామి, గుగులోతు రాజు, ధారావత్ వీరన్న, గుగులోతు చిన్నరాజు ,ఉప్పలయ్య, పందుల ఎల్లమ్మ ,వల్లందాస్ పుష్ప, శ్రీను, సమ్మయ్య ,బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
