
Asking nursing college students to vacate the hostel is a violation of students' rights.
*నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే*
*బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం కార్యదర్శి సబ్బని హరీష్*
*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం సబ్బని హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలాదన్నట్టు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరూ మెస్ బిల్లు కడితేనే హాస్టల్ లో ఉండండి లేకపోతే బయటకు వెళ్లిపోండి అని బెదిరించడం జరుగుతుంది తెలంగాణ నలుమూలల నుండి పేద బలహీన దళిత వర్గాల చెందినటువంటి అమ్మాయిలు ఈ నర్సింగ్ కోర్సులు చేస్తుంటే ప్రభుత్వం స్టైఫండ్ కూడా రిలీజ్ చేయకుండా వాళ్లను చదువుకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తుంది. దీనివల్ల వాళ్లు ఇంట్లో చెప్పుకోలేక కాలేజీలో ఉండలేక తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్నారు
బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాంలో కెసిఆర్ పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువలో ఉండాలని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించి సిబ్బందిని రిక్రూట్ చేసి అప్పటివరకు ఉన్న స్టైఫండ్ ను రెట్టింపు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి విద్యా వ్యవస్థ పై సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెర తీశారు.స్వయానా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యార్థులను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గురుకులాల్లో విషాహారం, పాము కాట్లు విద్యార్థుల ఆత్మహత్యలు, ఇప్పుడు నర్సింగ్ కళాశాల విద్యార్థుల ను హాస్టల్ నుండి గెంటి వేతలు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది
ఈ నర్సింగ్ కళాశాల విద్యార్థుల హాస్టల్లోనే ఉండి చదువుకునే వాళ్ళ హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుంటే మేము చూస్తూ ఊరుకోం వెంటనే వాళ్ళ స్టైఫండ్ విడుదల చేయాలి.
లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు అందరితో కలిసి ఆయా కాలేజీల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తామని
బిఆర్ఎస్వి పక్షాన హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మెట్టల సాయి దీపక్ రాచమల్ల మోహన్ కనుకుంట్ల వెంకటరమణ రాచమల్లు రామ్, భరత్,రాము,చిరంజీవి, నరేష్, సోఫీయాన్, మణి దిప్ సాయి తదితరులు పాల్గొన్నారు