BRTU Questions Arrests Over Auto Drivers’ Demands
వాగ్దానం పట్ల అడుగుతే అక్రమ అరెస్టులా
నర్సంపేట,నేటిధాత్రి:
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని అడుగుతే అరెస్టు చేస్తారా అని బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు ఆరోపించారు.
మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కి నెలకు జీవన భృతి కింద ఇస్తామన్న ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శాంతియుతంగా వెళ్తున్న కార్మికులను నవతెలంగాణ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్, జిల్లా నాయకులు పెండం వెంకటేశ్వర్లు, గణేష్, నరసయ్యలను అరెస్టు చేయడం సరికాదన్నారు.ఆర్థిక ఇబ్బందులకు గురై రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేసియ చెల్లించాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లకి జీవన భృతి కింద నెలకు 20 వేల రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో డ్రైవర్లకి రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి తద్వారా అర్హులైన కార్మికులకి సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని కోరారు.
