
Asia Cup 2025:
2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఎఇలోని దుబాయ్, అబుదాబిలలో జరగనుంది. ఇది ఆసియా కప్ 17వ ఎడిషన్. ఈసారి టోర్నమెంట్ T20 ఫార్మాట్లో జరుగుతోంది.
ఆసియా కప్‌ను తొలిసారి 1984లో ప్రారంభించారు. ఇప్పటివరకు భారత్ 8 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ చేరినా, ఇంకా ట్రోఫీని దక్కించుకోలేదు.
ఈ సారి 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. సెప్టెంబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ – హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. defending champions భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యుఎఇతో ఆడనుంది.
అత్యంత ఆసక్తికరంగా, భారత్ – పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. కాబట్టి లీగ్ దశలో ఒక మ్యాచ్, సూపర్ ఫోర్కు చేరితే మరో మ్యాచ్, ఫైనల్‌కు చేరుకుంటే మూడోసారి ఒకరినొకరు ఎదుర్కొనే అవకాశముంది. అంటే అభిమానులకు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మూడు ఉత్కంఠభరిత పోరాటాలు దక్కవచ్చు.