మహిళలు ఆషాడంలో ఆనందంగా జరుపుకునే గోరింటాకు పండుగ -అందం…ఆరోగ్యం…అతివలకు….
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
: గోరింటా పూసిండి కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది అన్నాడు ఓ సిని కవి. కృత్రిమ ఎరుపు కంటే ఆరోగ్యం ఇచ్చే గోరింట మిన్న అషాడం వచ్చింది అంటే చాలు గోరింటాకు ప్రతి ఒక్క మహిళలకు గుర్తొస్తుంది. ఆషాడ మాసం ముగిసే లోపు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని పూర్వికులు చెబుతారు. అందుకే ఆషాడం అంటే గోరింటాకు పండుగ అంటారు. గోరింటాకు చేతులకు పెట్టుకొని యువతులు ఎంతో మురిచిపోతూ ఉంటారు. శుభకార్యాలు పండుగలు ఆషాడ మాసంలోనే, ఔషధణాలు గోరింటాకుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇటీవల కాలంలో మహిళలందరూ ఒకేచోట చేరి మెహందీ పడుగ గాను చేసుకోవడం. కిట్టి పార్టీలో కూడా ఆషాడ మొహింది పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు ఒకచోట గోరింటాకు పెట్టుకునేటప్పుడు మహిళలు ఎంతో సందడిగా ఉత్సాహంతో ఉంటారు. చర్మవ్యాధులు రాకుండా వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు అనేది ఎప్పటి నుంచో వస్తున్న మన సంప్రదాయం ఆరోగ్య రహస్యం, ఆషాడ మాసంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పొలాలు బురదగా మరి క్రిమికీటకాలు వస్తుంటవి. మహిళల పొలాల్లో వరినాట్లు వేయడం వలన చేతులు కాళ్ళకు బురద అంటుకుంటుంది. ఈ ఆషాడ మాసంలో మైదాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతాయని వైద్యులు పలువురు చెబుతున్నారు.
ఆషాడ మాసం యొక్క ప్రత్యేకత…
ఆషాడ మాసంలో ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలి అనేది మన పూర్వీకులు చెప్పిన సంప్రదాయం. ఆనాటి నుండి సాంప్రదాయాలు అదేవిధంగా నేటి వరకు కొనసాగుతున్నాయి. గోళ్ళకు రంగును ఇచ్చే గోరింటాకు సఖరంజని అనే పేరు కూడా ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేటి ఆధునిక కాలంలో గోరింటాకు పేరుతో రకరకాల కోన్లూ పేస్టులు మహిళలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ కోన్లు పేస్టులు రంగును అందాన్ని ఇస్తాయి తప్ప వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉండవు.
గోరింటాకు ప్రయోజనాలు…
మైదాకు వేళ్లకు పెట్టుకోవడం, గోళ్ళు పెలుసు బారిపోకుండా కాపాడుతుంది. ఆకులే కాకుండా పూలు, వేర్లు, బెరడు విత్తనాలు కూడా ఔషధ యుక్తాలే. వీటితో శరీరంలోని ఎలర్జీను దూరం చేసుకోవచ్చు. బోధకాలు వ్యాధి ఎలాంటి
దరిచేరదు. నెలకు ఒకసారి గోరింటాకు ముద్దను తలకు ప్యాక్ చేసుకుంటే జుట్టు బలపడి రాలదుంటాకు ఉంటుంది. గోరింటాకు పొడి కాచిన నూనె వాడడం చిట్కా వైద్యంలో ఒకటి. గోరింటాకు ముఖ్యంగా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది..
1.గోరింటాకు తయారు చేసే విధానం… జిమ్మిడి లోకేశ్వరి
మైదాకులో చింతపండు చేసి మధ్యలో కొద్దిగా మజ్జిగా • వేసి రోట్లో రుబ్బాలి. మిక్సీలోన నాణ్యమైన గోరింటాకు ఇత్తలూ ఆకులు పొడిని వేడి నీళ్ళలో కలిపి రాత్రంతా నానబెడితే మంచి రంగులోకి మారుతుంది. మెహందీకు కాపా పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు పెట్టుకోవాలి దీంతో కాపీ బ్రౌన్ కలర్లో పండుతుంది. నెంబర్ వసంతంలో పంచదార తయారు చేసుకోవాలి. పెన్నాకు కాపీ పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి తర్వాత రోజు పెట్టుకోవాలి.
సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక .
2. జాడి సరిత . తాటిగూడెం
ఆషాడ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనేది సంస్కృతి సాంప్రదాయంగా వచ్చే ఆనవాయితీ, వర్షాకాలం వస్తే ఆరోగ్య బారిన పడకుండా గోరింటాకు శరీరానికి వెచ్చద నాన్ని ఇస్తుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అని తాటిగూడెం జాడి సరిత నేత తెలిపారు.
చిన్ననాటి నుండి వస్తున్న ఆచారం :
3.దుర్గం స్వాతి
ఆషాడ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనేది చిన్ననాటి నుండి ఒక ఆనవాయితీ చిన్నతనం నుండి గోరింటాకు పెట్టుకుంటున్నాను. గోరింటాకును పోసి రోట్లో వేచి దంచి పాడపాడుతూ ఒకే చోటకు చేరి గోరింటాకును పెట్టుకునే వాళ్ళం అని దుర్గం స్వాతి అన్నారు.
4.గాజులు ఇచ్చి పుచ్చుకుంటాం: దుర్గం సుష్మ
ఆషాడం వచ్చింది అంటే గాజులు ఇచ్చిపుచ్చు కుంటాం. ఆషాడం వచ్చిందంటే ముందుగా గుర్తిచ్చేది గోరింటాకు. అందరం ఒకేచోట చేరి గోరింటాకు పెట్టుకోవడంతో గాజులు ఇచ్చిపు చ్చుకుంటాం. అమ్మవారికి పూజలు నిర్వహించి గోరింటాకు పెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని దుర్గం సుష్మ తెలిపారు.
5.అనాదిగా వస్తున్న ఆచారం : గోగు అనిత.
గోరింటాకులో మంచి ఔషధ గుణాలు
ఉన్నాయి. గోరింటాకు పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. సాంప్రదాయమే కాకుండా వాతావరణంలో వచ్చే మార్పుల వలన శరీరంలో వచ్చే మార్పులను తొలగించే మంచి ఔషధం గోరింటాకు ఉంది.
అందుకే ఆషాడంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటాం అని గోగు అనిత అన్నారు.
6.సంప్రదాయం… ఔషధం: జాడి దీపిక
మైదాకు చేతులకు పెట్టుకోవడం సంప్రదా యంతో పాటు మంచి ఔషధం. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. నేడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కోన్లు వచ్చాయి. కోన్లను వాడాల్సి వస్తుంది. మంచి కంపెంనీలకు చెందిన గోరింటాకు కోన్లలో ఎలాంటి సైడ్ ఎఫె క్లలు ఉండవు. శుభకార్యాలకు మహిళలు తప్పక మైదాకు పెట్టుకుంటున్నారు అని కరకగూడెం జాడి దీపిక అన్నారు.