# రూ. 18 వేల వేతనం ఇవ్వాలి
బీఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు
నర్సంపేట,నేటిధాత్రి :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశాలకు 18 వేల రూపాయల వేతనం అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (బీఆర్టియు అనుబంధ) సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు ,ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువాల లలిత మాట్లాడుతూ ఆశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెట్టి చాకిరి చేపించుకుంటుందని పల్స్ పోలియో, లెప్రసీ సర్వే,టీబీ సర్వే, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అనేక సర్వేలను నిర్వహించుటకు రోజుల తరబడి ట్రైనింగ్ ఇచ్చి సర్వేలు చేస్తున్న పనులు చేయించుకొని ఇప్పటికీ ఒక రూపాయి ఇవ్వలేదని అన్నారు. ఏఎంసి టార్గెట్ల పేరుతో ఆశలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఎన్ఎం జీఎన్ఎం పోస్టుల భర్తీలో ఆశలకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఆశాలందరికీ హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి గతంలో ఆశలకి మొబైల్స్ ఇచ్చారని అవి పూర్తిగా పనిచేయడం లేదు కాబట్టి వాటి స్థానంలో కొత్త మొబైల్స్ ఇవ్వాలి ఆశలకి నాణ్యమైన యూనిఫామ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు మంజుల, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్య, మహేశ్వరి,సంధ్య, అనిత, మాధవి, మధులత,సాలమ్మ, జ్యోతి,రమ తదితరులు పాల్గొన్నారు.