నరేష్ నాయక్ నియామకం..
మహాబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల అసెంబ్లీ, మిడ్జిల్ మండలంలోని పెద్ద గుండ్ల తాండ గ్రామపంచాయతీ మర్లబాయి తండాకు చెందిన మెగావత్ నరేష్ నాయక్ ను రాష్ట్ర సంస్థ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ నూతన మిడ్జిల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా నరేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ బలోపేతం చేయడానికి తన కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన నియమానికి సహకరించిన పాలమూరు ఎంపీ డీకే.అరుణమ్మ కి ధన్యవాదాలు తెలుపుతూ, సహకరించిన మండల నాయకులకు, జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.