మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు మున్నూరు కాపు కార్పొరేషన్ కి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది

*మున్నూరు కాపుల్లో రాజకీయ చైతన్యం రావాలి.

*ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హైదరాబాద్ సచివాలయంలోని తన ఛాంబర్ లో వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్నూరు కాపు వివిధ సంఘాల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలని మున్నారు కాపు సంఘ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల్లో మున్నూరు కాపు కులానికి న్యాయం చేయాలని తమ కులంలో ఎక్కువ శాతం కుటుంబాలు వ్యవసాయం పైనే జీవనం సాగిస్తున్నారని మంత్రి కి తెలిపారు.

ఇప్పుడిప్పుడే తమ కులంలో అక్షరాస్యత పెరుగుతుందని మున్నూరు కాపు కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే తమ సంఘాలకు కొంత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకే కార్పొరేషన్ ఏర్పాటు పై మేనిఫెస్టో లో చేర్చారని తెలిపారు. మున్నూరు కాపు జనాభా రాష్ట్రం లో 50 లక్షలకు పైగా ఉందన్నారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ బీసీ వర్గాలకు అన్నిటికి కలిపి బీసీ ఫెడరేషన్ ఉంటుందని 36 కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ ఉందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేత్రుత్వంలో మున్నూరు కాపు కార్పొరేషన్ పై శాఖ పరంగా చేయాల్సినవి చేస్తామన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. మున్నూరు కాపు కార్పొరేషన్ పై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు తమ దృష్టికి తోసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వాలు మున్నూరు కాపు కార్పొరేషన్ ని ఏర్పాటు చేయలేకపోయాయని తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2014లొ ఎంపీ గా ఉన్నప్పుడు కరీంనగర్ ,వేములవాడ లో మున్నూరు కాపు భవనాలకు 10 లక్షల చొప్పున కేటాయించానని మంత్రి గుర్తు చేశారు. మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలంటే సంఘల్లో మున్నూరు కాపు రాజకీయ చైతన్యం రావాలని తెలిపారు. మున్నూరు కాపు నేతలు కూడా ఎమ్మెల్యేలు , మంత్రుల దృష్టికి తీసుకెళ్ళని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో బీసీ సంక్షేమం పై జరిగే సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్ పై సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

బీసీ వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, మున్నూరు కాపు కి చెందిన వివిధ సంఘల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *