Gnanodaya College Sports Meet Launched
మెట్ పల్లి డిసెంబర్ 20 నేటి ధాత్రి
మెట్ పల్లి లో జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో క్రీడోత్సవంలో భాగంగా
కళాశాల కరస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్ క్రీడా కార్యక్రమాన్ని శనివారం రోజు ప్రారంభించారు అనంతరం కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ దాదాపు పది రకాల క్రీడా పోటీలు ఉన్నాయని వాటిలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకట కుమార్ వైస్ ప్రిన్సిపాల్ రాజు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
