గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.జిల్లావ్యవ పరిశీలకుల తనిఖీ…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు జిల్లావ్యయ పరిశీ లకుల ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఏర్పాటుచేసిన ఎస్ .ఎస్. టి .చెక్పోస్ట్ ను పరిశీలించి. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకుని సిరిసిల్ల సిద్దిపేట దారి పైన వచ్చి పోయే వాహనాలను చెక్ చేస్తూ ఎన్నికల నియమాలు ప్రకారం ఎటువంటి. మండలంలో ప్రజలను ఎటువంటిప్రబోభాలకు గురికాకుండా చూసుకుంటూ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఏదైనా తనిఖీల్లో భాగంగా అనుమానం ఉన్నచో సంబంధిత వాహనాల గురించి అందులో ప్రయాణిస్తున్న వారిపై ఏమైనా అనుమానం వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిఘాపై కఠినంగాతగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అలాగే. తంగళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయం పరిశీలిస్తూ మండలంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందా అనేదానిపై ఎంపీడీవో లక్ష్మి రాజ్యమును రిటర్న్ అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో. ఎన్నికల జిల్లా వ్యాయ. పరిశీలకులు రాజ్ కుమార్. నోడల్ అధికారి నవీన్. భారతి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ. ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
