రుయా హాస్పిటల్ హె.డి.ఎస్ మెంబర్ గా జనసేన నేత..
*ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రొసీడింగ్ అందుకున్న మునస్వామి..
తిరుపతి(నేటిధాత్రి)
రుయా హాస్పిటల్ హె.డి.ఎస్ మెంబర్ గా మునస్వామి నియమితులైన సందర్భంగా.. బుదవారం ప్రొసీడింగ్ ఆర్డర్ ను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా మునస్వామి అందుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన నాయకులతో కలిసి మునస్వామిని సత్కరించి అభినందనలు తెలియజేశారుక్రమశిక్షణతో కూడిన రాజకీయ పార్టీ జనసేన పార్టీ అని, జనసేన ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న వారికి జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగిన ప్రాధాన్యతను కల్పిస్తారని, పార్టీలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో నడుచుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారుతిరుపతి జనసేన పార్టీ తరపున రుయా హాస్పిటల్ హె.డి.ఎస్ మెంబర్ గా మా పార్టీ సీనియర్ నాయకుడు మునస్వామి ఎన్నిక అవ్వడం చాలా సంతోషం గా ఉందని నగర అధ్యక్షుడు రాజారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన మరికొందరు నేతలకు గుర్తింపు దక్కుతుందని స్పష్టం చేశారు. నాపై నమ్మకంతో నాకు ఈ పదవిని ఇచ్చిన మా పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు,తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కు మునస్వామి కృతజ్ఞతలు తెలియజేశారునా వంతు నేను రుయా హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ నేతలు బాబ్జి, హరి శంకర్, సుభాషిని, సుమన్ బాబు, రాజమోహన్, మధు బాబు, రాజేష్ ఆచారి, కిషోర్,లక్ష్మి, మధులత, శిరీష,రాధా, బాలాజీ, పురుషోత్తం, శ్రావణ్,ఆది, రమేష్ నాయుడు, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్, వెంకటేష్, పవన్ కుమార్, జీవన్,మంజు, సుజిత్, లోకేష్, రమేష్ అతిథులు పాల్గొన్నారు.
