ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో శ్రీ భవాని సమేత మహా లింగేశ్వర స్వామి, ప్రాణ, ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా,విగ్రహాలు జలాధివాసం చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం భీమ్ రెడ్డి లలిత్, కీర్తి రెడ్డి అర్షిత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అలాగే రేపు అనగా ఆదివారం ఉదయం విగ్రహాల ప్రతిష్ట ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పార్వతి పరమేశ్వరుల కృపకు పాత్రులు కాగలరని కోరారు .