
ఘనంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వాకులా భరణం శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసిల పదవి కాలం నేటితో ముగిస్తుండడంతో రూరల్ ఎంపీటీసీ లైన రంగు వెంకటేష్ గౌడ్, బొడ్డు రాములు -శంకరవ్వ మరియు
చెన్నడి శ్యామల గోవర్ధన్ రెడ్డి లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రొండి రాజు, బీసీ సెల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం తాజా మాజీ సర్పంచులు జైపాల్ రెడ్డి , కరుణాకర్, మహిళా అధ్యక్షురాలు లహరి,గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు మర్రిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్ నాయకులు రోమాల ప్రవీణ్, ఈడపల్లి అనిల్, రాజేశం, సంజీవ్ ,రణధీర్ పాలకుర్తి రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షులు వాకుల భరణం శ్రీనివాస్ మాట్లాడుతూ 2019లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మండల ప్రజలు మండలంలో మూడు ఎంపిటిసి స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించినారని కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, పదవులు అనేటివి సేవకు అడ్డం కాదు అని. ప్రజా జీవితంలో ప్రజల గురించి ఎప్పుడూ ప్రజా జీవితంలో ఉండాలని ఆయన మాట్లాడారు.