వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రానికి నేడు రాత్రికి ఆర్యవైశ్య సంఘం తరఫున ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కల్వ సుజాత వనపర్తికి వస్తున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆత్మీయ సమ్మేళనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమంటపంలో జరుగుతుందని ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శివసేనారెడ్డి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు వనపర్తి జిల్లా ఆర్యవైశ్యులు నియోజకవర్గానికి చెందిన పట్టణ ఆర్యవైశ్య అవపా వాసవి క్లబ్ అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు
నేడు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత వనపర్తికి రాక
