
ఆర్ట్స్ కళాశాల ఆవరణలో చిర్ర కబడ్డీ జెర్సీ టీం సంబంధించిన టీషర్టులను తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం రాష్ట్ర (టి.జి.ఫ్) అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య జి హనుమంతు కబడ్డీ జెర్సీ టీ షర్ట్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిర్ర జెర్సీ కబడ్డీ టీం జరగబోయే టోర్నమెంట్లో ఓరల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలవాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.జి.ఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ చింతం ప్రవీణ్,టిజిఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాడబోయిన జితేందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ మదన్ చంద్రబోస్,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయి ప్రకాష్, మణికంఠ,సాగర్, సాయి, వెంకట్ తదితరులు గ్రాడ్యుయేట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.