జమ్మికుంట: నేటి ధాత్రి
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని 2030 వరకు నియంత్రణ చేయాలని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నటరాజ్ కళాజాత బృందం చే జమ్మికుంటలో అవగాహనకల్పించారు .జమ్మికుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా సమీపంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై నటరాజ్ కళాబృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాటల ద్వారా
హెచ్‌ఐవీ వైరస్ సోకడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి చెందే విధానం, క్షణిక ఆవేశంలో చేసే తప్పులవల్ల కుటుంబం చిన్న భిన్నమై ఎదుర్కొనే ఇబ్బందులను గురించి వివరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి నిధులను విడుదల చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రజలందరూ హెచ్ఐవి పై అవగాహన కలిగి ఉండి వ్యాధి దశ అభివృద్ధి చెందక ముందే అవసరమైన మందులు ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, హెచ్ఐవి బారిన పడినవారు క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితి అయితే సంబంధించిన కండోమ్ ప్యాకెట్లను ఉపయోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాగరాజు నాయక్, శంకర్, నవ్య, రవి తదితరులు పాల్గొన్నారు.