వీణవంక మండల బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని (డిఎస్పి)నాయకులు పిలుపు
వీణవంక, (కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి చిలువేరు,శ్రీకాంత్ గారి ఎన్నికల ప్రచార సభ 11 న జమ్మికుంట లో గాంధీ చౌరస్తా వద్ద ఉదయం 10:00 గంటలకు లకు కార్నర్ మీటింగ్ రోడ్ షో నిర్వహించనున్నట్లు వీణవంక మండల నాయకులు సదానందం తెలిపారు. ఈ రోడ్ షో సభకు ముఖ్య అతిథులుగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్ గారు హాజరుకానున్నారు అని పార్లమెంట్ పరిధి మరియు వీణవంక మండల వివిధ గ్రామాలలో ఉన్న (డి ఎస్ పి) కార్యకర్తలు, అభిమానులను,బీసీ,ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల ప్రజస్వామ్య వాదులు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి నాయకులు రాకేష్, రాజేంద్ర ప్రసాద్,అనిల్,రవికిరణ్,వినయ్,రాజు, తిలక్ తదితరులు పాల్గొన్నారు.