
నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేస్తాం
బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో బీజేవైఎం నాయకులను అక్రమ అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదు ఈ సందర్బంగా బీజేవైఎం కళాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న బీజేవైఎం నాయకులను అక్రమ అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ పాలనకు నిదర్శనం ప్రజలందరు చూస్తూనే ఉన్నారు ఏవి అయితే హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చారో అన్ని నెరవేర్చాలి లేనియెడల ప్రజ ఆగ్రాహానికి గురి కాక తప్పదు 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ లు లేక ఎంతో మంది యువతీ యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగుల కోసం 25000 ఉద్యోగాలతో మెగా dsc వేయాలని గ్రూప్ 2మరియు గ్రూప్ 3లో ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ లు వేయాలని జాబ్ నోటిఫికేషన్ వేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నది ఎక్కడ కూడా ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు బీజేవైఎం నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుంది స్థానిక మంత్రి అయినా సీతక్క ఇప్పటికైనా ఇక్కడి నిరుద్యోగుల కోసం జీ వో 317 మరియు 46 ని తీసివేయించి స్థానికేతరులని పంపించి ఇక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నది
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ బీజేవైఎం నాయకులు భాస్కర్,రాజక్ ఉన్నారు