REVA Condemns Arrest of Pensioners in Mahabubabad
పెన్షనర్ల అరెస్టు అప్రజాస్వామిక చర్యరేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రి నారాయణ
మహబూబాబాద్/ నేటి ధాత్రి
రేవా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శాంతియుతంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్నికి వెళ్లకుండా మహబూబాద్ జిల్లా శాఖ రేవా బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
గత 2024 మార్చి నుండి పదవి విరమణ ఉద్యోగస్తులందరికీ మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ అనేక ఇబ్బందులను గురి చేస్తుందని, ఇప్పటికీ 46 మంది ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వంలో చలనం లేదని నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగా చేయాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వెళ్తున్న జిల్లా అధ్యక్షుడు సంకాబద్రి నారాయణను,ప్రధాన కార్యదర్శి గుగులోత్ కిషన్ నాయక్‌ను, ఉపాధ్యక్షులు రిటైర్డ్ సిఐ రవీందర్ ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమ అరెస్టు చేశారని తెలిపారు. ఇది అప్రజాస్వామిక చర్యని, అదేవిధంగా జిల్లాలో డోర్నకల్ లో బాధ్యుడు ఏసు రత్నాన్ని, తొర్రూర్ లో ఇట్ట సోమిరెడ్డి బృందాన్ని, పెద్ద వంగర లో ప్రభాకర్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని తెలిపారు.ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యని రాజ్యాంగపరమైన హక్కును కాలరాశారని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తన నిరసన తెలిపే అధికారం ఉన్నదని అన్నారు, సమాఖ్య ఆంధ్రలో 42 రోజులు సమ్మె చేస్తే ఒక్కసారి కూడా అరెస్టు చేయలేదని ఏరుకోరి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం అరెస్ట్ చేయడం మూర్ఖత్వం అని అన్నారు.ఇది ప్రజా ప్రభుత్వ విపల ప్రయాస మాత్రమేనని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వము మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.సోమాగోవర్ధన్ మురళీదరస్వామి, నిరంజన్, సుంకరి వెంకటేశ్వర్లు, చంద్రమౌళి తదితర రేవా సభ్యులు పాల్గొన్నారు.
