చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వేములవాడ పట్టణానికి చెందిన రమేష్ తన కారులో శ్రీనివాస్ అనే యజమాని రైస్ మిల్ కు నాలుగు క్వింటాల్ల పీడీఎస్ బియ్యాన్ని రైస్ మిల్ కు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.