
వేములవాడ పట్టణ సి.ఐ కరుణాకర్
వేములవాడ నేటిధాత్రి
బోయినపల్లి గ్రామానికి చెందిన పెగ్గెర్ల చంద్రశేకర్ తండ్రి బొందయ్య అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా వేములవాడ పరిధిలోని కోనాయపల్లి గ్రామంలో ఆఫీస్ పెట్టుకొని ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం గల్ఫ్ దేశాలకు పంపుతానాని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని వారిని గల్ఫ్ దేశాలకు పంపకుండా మోసాలకు పాల్పడుతున్నారు. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మల్యాల దుర్గయ్య అనే వ్యక్తి ని ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్ దేశానికి పంపిస్తా అని నెలకు లక్ష జీతం అని నమ్మించగా ఉక్రెయిన్ దేశానికి పంపించడానికి 2,75,000/- రూపాయలు ఖర్చు అవుతుందని అవి కట్టిన నెల రోజుల లోపు ఉక్రెయిన్ దేశానికి పంపిస్తా అని చంద్రశేఖర్ దుగ్గయ్యకి ని నమ్మించగా దుగ్గయ్య చంద్రశేఖర్ కి 2,75,000/- కట్టగా ఎలాంటి 2 సంవత్సరాల నుండి ఉక్రెయిన్ దేశానికి పంపకుండా అడిగిన ప్రతిసారి మాట దాటవేస్తుండగా దుగ్గయ్య వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వేములవాడ టౌన్ పోలీస్ వారు చీటింగ్ మరియు ఇమ్మిగ్రేషన్ ఆక్ట్ లో కేసు నమోదు చేసి నమ్మదగని సమాచారం మేరకు ఈ రోజు చంద్రశేఖర్ ని జగత్యాల బస్సు స్టాప్ వద్ద పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని టౌన్ సి.ఐ కరుణాకర్ తెలిపారు.
ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి.
నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు, కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాల నుండి గల్ఫ్ కు ఉపాధి నిమిత్తం వెళ్ళేవారు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏజెంట్లను సంప్రదించి ఉపాధి అవకాశాలను పొందాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు,నకిలీ గల్ఫ్ ఏజెంట్ల సమాచారం ఉన్న వారు స్పెషల్ బ్రాంచ్ సి.ఐ 8712656411 అనే నెంబర్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు.అంతే కాకుండా ఉపాధి,ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళేవారు జిల్లాలోని ఏజెంట్లను సంప్రదించే ముందు వారికి సంబంధించిన పూర్తి వివరాలు అనగా ప్రభుత్వ ఏజెంట లేదా నకిలీ ఏజెంట అతని మీద ఎలాంటి కేసులు ఉన్నాయా మొదలగు సమాచారం ఈ నెంబర్ ద్వారా తెలులుకోవచ్చు అని అన్నారు.