`పేరుకుపోయిన ‘‘కన్నయ్య’’ బకాయిలు! అతని మిల్లులకే పుట్లకొద్ది వడ్లు!!
`’’కన్నయ్య’’ అక్రమ దందా! అధికారుల అండ??
`’’కన్నయ్య’’కు సెంటర్ల అప్పగింతపై ‘‘జేసి’’కి ఎందుకంత మక్కువ?
`బకాయిలు లేని మిల్లర్లకు వడ్లు ఇచ్చేందుకు ‘‘జేసి’’ ససేమిరా?
`’’కన్నయ్య’’ కు మాత్రం అందరికన్నా పెద్దపీట!
`ఎప్పటి నుంచో ‘‘జేసి’’కి ‘‘కన్నయ్య’’కు మంచి దోస్తీ!
`’’కన్నయ్య’’ దందాకు ‘‘జేసి’’తో పాటు అధికారుల సహకారం?
`బకాయిలు లేని మిల్లర్లపై ‘‘జేసి’’ చిన్నచూపు.
`డిఫాల్టర్ ‘‘కన్నయ్య’’ అంటే ‘‘జేసి’’కి ఎనలేని ప్రేమ?
`డిపాల్టరైనా సరే ‘‘కన్నయ్య’’కు 20 సెంటర్లు అప్పగింత!
`’’కన్నయ్య’’ అక్రమ బియ్యం దందాకు ‘‘జేసి’’ సహకారం?
`కోట్లలో బకాయిలున్న ‘‘కన్నయ్య’’!
`’’కన్నయ్య’’ మీద గతంలోనే కాంగ్రెస్ నాయకుల పిర్యాదు!
`అధికారులు తీసుకున్న వినతిపత్రాలు బుట్ట ధాఖలు!
`ప్రభుత్వ స్థలాలలో ‘‘కన్నయ్య’’ మిల్లులు!
`ఎస్సారెస్పీ కాలువ రోడ్డు ఆక్రమణ!
`నిజమే అని ఇరిగేషన్ ఇంజనీర్ నివేదిక.
`’’జేసి’’ అండతో రెచ్చిపోతున్న ‘‘కన్నయ్య’’!
`నన్నెవరూ ఏమీ చేయలేరు! నా వెనుక ‘‘మంత్రి’’ వున్నారు?
`’’మంత్రి ఆశీస్సులు’’ నాకే వున్నాయి?
`అటు నాయకులు, ఇటు అధికారుల ‘‘మంత్రి’’ పేరు చెప్పి ‘‘కన్నయ్య’’ ఆగడాలు!
`కింది స్థాయి అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలు?
`డిఫాల్టర్ ‘‘కన్నయ్య’’కు 350 కి పైగా ఏసీకే లు ఎలా ఇచ్చారు?
`’’కన్నయ్య’’ను లీడర్ ను చేస్తే మొదటికే మోసం వచ్చిందంటున్న మిల్లర్లు!
`మాకు పని లేకుండా చేశాడని మిల్లర్ల ఆందోళన.
`’’పిడిఎస్ దందా’’లో చీకటి దొంగ ‘‘కన్నయ’’! అంటూ ‘‘నేటిధాత్రి’’ తో చెబుతున్న మిల్లర్లు?
`’’దొడ్డు బియ్యం’’ సన్న బియ్యం చేసి సరఫరాలో ఆరి తేరాడని ఆరోపణలు
`అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్న రొటేషన్ ‘‘కన్నయ్య’’ అంటూ విమర్శలు!
`ఏ పార్టీ అధికారంలో వుంటే అందులో దూరుతాడు!
`లీడర్లంతా నా వాళ్లే అని చెప్పుకుంటాడు!
`ఏళ్ల తరబడి సాగుతున్న ‘‘కన్నయ్య’’ అక్రమ దందాలు.
`డిఫార్లర్లకు వడ్లు ఇచ్చేది లేదన్న ప్రభుత్వం.
`మరి ‘‘కన్నయ్య’’ కు అధికారులు వడ్లు ఎలా ఇచ్చారు?
`పట్టుబట్టి డిఫాల్టర్లకే వడ్లు అప్పగింతకు అధికారుల ఉత్సాహం.
`ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్?
హైదరాబాద్,నేటిధాత్రి:
అధికారులు అవినీతికి అలవాటు పడి, సంపాదనకు ఎగబడి, సేవ చేయాల్సి వాళ్లు దోపిడీకి అలవాటు పడితే వ్యవస్ధను అక్రమార్కులకు అప్పగించడమే అవుతుంది. దోపిడీ దారుల చెప్పుచేతుల్లోకి వెళ్లిన అదికారుల మూలంగా వ్యవస్ధలు భ్రష్టుపట్టిపోతున్నాయని చెప్పడానికి అనేక రుజువులున్నాయి. అలాంటిదే ఇది. ఉన్నత ఉద్యోగ విధి నిర్వహణలో వున్న వ్యక్తులు పేదలకుఅండగా, అన్యాయాలకు అరికట్టాల్సిందిపోయి, అక్రమార్కులకు అండగా, వారికితోడుగా నిలవడం మూలంగానే ప్రజా ధనం పరుల పాలౌతుంది. ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. ఖజానకు రావాల్సిన సొమ్ము ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. దాంతో వ్యవస్ధలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. మన దేశంలోనే అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిన వ్యవస్ధ ఏదైనా వుందంటే అది సివిల్ సప్లయ్ డిపార్టుమెంటు అన్నపేరు మరింత సార్ధకం చేస్తున్నారు మన అధికారులు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంచనల నిర్ణయం తీసుకున్నది. ఒక రకంగా చెప్పాలంటే అక్రమార్కులకు అడ్డు కట్ట వేసేంత కఠిన నిర్ణయం తీసుకున్నది. కాని దాన్ని అమలు చేయాల్సిన అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు తూట్లు పొడుతున్నారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్‌కు రావాల్సిన బకాయిలు దాదాపు 26వేల కోట్ల రూపాయలుగా లెక్కలు తేల్చారు. మరి వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత అధికారులది. కాని ఆ అధికారులు అక్రమర్కులకు తొత్తులైపోతున్నారు. అక్రమ సంపాదన పరులకు కొమ్ము కాస్తున్నారు. దాంతో వ్యవస్ధలను నిండా ముంచేవాళ్లు పెరిగిపోతున్నారు. వ్యవస్థలను నిండా ముంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతుల నుంచి వడ్ల సేకరణకు ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించింది. రైతుల నుంచి సేకరించి వడ్లను ఎలాంటి బకాయిలు లేని మిల్లర్లకు మాత్రమే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టిపరిస్ధితుల్లోనూ బకాయి పడ్డ మిల్లర్లకు ఒక్క వడ్ల గింజకూడా వెళ్లకూడదని తేల్చి చెప్పింది. బకాయిలు పడ్డ మిల్లర్లు తమ బకాయిలను చెల్లిస్తే తప్ప వడ్లు ఇచ్చేందుకు ససేమిరా అని తేల్చి చెప్పేసింది. మరి అధికారులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నారా? అంటే సమాధానం చెప్పేవారు లేరు. ఎందుకంటే అధికారులు ముందు ప్రాధాన్యత ఇస్తున్న మిల్లర్ల లిస్టు చూస్తే బకాయి దారులే ముందు వరసలో వున్నారు. అదే అ కథనం సారాంశం. వరంగల్ జిల్లాలో కన్నయ్య అనే ముద్దుగా పిలిపించుకునే డిఫాల్ట్ మిల్లర్ ప్రభుత్వానికి కోట్లాది రూపాయాలు చెల్లించాల్సి వుంది. వరంగల్ జిల్లాలో వున్న అతి పెద్ద డిఫాల్లర్లో ఈ కన్నయ్య ఒకరు. మరి అలాంటి కన్నయ్యకు అదికారులు పెద్ద పీట వేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా పనిచేస్తున్న మిల్లర్లకు మెండిచేయి చూపిస్తున్నారు. ఇదేంటని అడిగే శక్తి వారికిలేదు. అడిగినా వారి గోడు వినేనాధుడు లేడు. వారు ఎవరికి చెప్పుకున్నా అరణ్య రోధనే అవుతుంది. ఆది నుంచి ఎంతో నమ్మకంగా ప్రభుత్వం ఇచ్చిన వడ్లను లెక్కలతో సహా అప్పగించిన మిల్లర్లకు తీవ్ర అన్యాయం జరగుతోంది. ప్రభుత్వానికి పెద్దఎత్తున బాకీ పడిన మిల్లర్ కన్నయ్య మిల్లులకు మాత్రం పుట్లకొద్ది ధాన్యం వెళ్తోంది? ఇదెలా సాధ్యమని మాత్రం అనుకోకుండి. ఎందుకంటే అదికారులు ఆశీస్సులు వుంటే ఎంత పెద్ద డిఫాల్టరైనా సరే వడ్లు వచ్చి తీరాల్సిందే. వారి మిల్లులకు చేరాల్సిందే. వాళ్ల బకాయిలు కొండాలా పేరుకుపోవాల్సిందే? అన్న చందంగా వుంది. కన్నయ్య అనే మిల్లర్ మీద విపరీతమైన ఆరోపణలున్నాయి. మిగతా మిల్లర్ల నుంచి అనేక విమర్శలున్నాయి. అయినా అధికారులకు కన్నయ్యే బంధువౌతున్నాడు. కన్నయ్యకే వడ్లు అప్పగించేందుకు అధికారులు ముందుకొస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఏ రైస్ మిల్లర్‌ను కదిలించినా కన్నయ్య దోపడీ అక్రమాలపై కథలు,కథలుగా చెప్పుకుంటారు. కన్నయ్యకు రెండు రైస్ మిల్లులున్నాయి. ఆ రైస్ మిల్లుల పేరు మీద కోట్ల రూపాయాల బకాయిలున్నాయి. ఇక్కడ అసలు విషయమేమింటే ఆ మిల్లుల నిర్మాణం కూడ అక్రమమే అన్న ఆరోపణలు వున్నాయి. కన్నయ్య మిల్లు ఏకంగా ఎస్సారెస్పీ కాలువకు చెందిన భూమిలోనే నిర్మాణం జరిగినట్లు ప్రజలు ఏకంగా పిర్యాధులు చేసిన సందర్భాలున్నాయి. కన్నయ్య మిల్లుల మూలంగా అటు ప్రభుత్వ రోడ్లు పాడౌతున్నాయని, ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగిందంటూ ప్రజలు అధికారులకు వినతిపత్రాలు అందించారు. మీడియా ముఖంగా సాక్ష్యాలు బైటపెట్టారు. ఇలా ప్రభుత్వ భూమిని అక్రమించుకొని రైస్ మిల్లులను నిర్మాణం చేయడమే కాకుండా, ఓ జాయింట్ కలెక్టర్ అండదండలతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు అనేకం వున్నాయి. దాంతో కన్నయ్య ఆడిరది ఆట.పాడిరది పాట అన్నట్లు సాగుతోంది. జిల్లాలోనే అతి పెద్ద డిపార్టర్గా వున్న కన్నయ్య ఒక్కడికే ఏకంగా 20 సెంటర్లు అప్పగించారంటే జాయింట్ కలెక్టర్ మక్కువ ఎంత వుందో అర్దం చేసుకోవచ్చు. అంటే దాదాపు 350 కొనుగోలు కేంద్రాలను ఆయనకు పట్టుబట్టి అప్పగించినట్లే లెక్క. మొత్తం సెంటర్లన్నీ ఒక్క కన్నయ్యకే అప్పగిస్తే, మరి మిగతా మిల్లర్లకు వడ్లు ఎవరివ్వాలి? ఎలా ఇస్తారు? ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా న్యాయంగా మిల్లులు నడుపుతున్న వారిలో కన్నయ్య కోసం అధికారులు వారి నోట్లో మట్టి కొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక కన్నయ్య చేసే పిడిఎస్ బియ్యం అక్రమ రవాణ హద్దే లేదని సాటి మిల్లర్లే చెబుతున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి, సంక్షేమ హస్టళ్లకు అందించేందుకు అధికారుల దగ్గరుండి సహాకారం అందిస్తున్నారని కూడా తెలుస్తోంది. సంక్షేమ హస్టళ్లకు సరఫరా చేయాల్సిన సన్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం. ఒక్క కన్నయ్య ఇన్ని అక్రమాలు సాగిస్తున్నా అధికారులకు కనిపించడం లేదంటే అర్ధమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నయ్య చేసే అక్రమ దందాలపై గతంలో కొంత మంది జర్నలిస్టులు వార్తలు రాసే సాహసం చేశారు. కాని వారిని కూడా కన్నయ్య బెదిరించిన సందర్భాలున్నట్లు జర్నలిస్టులు అంటున్నారు. ఏ పార్టీ అధికారంలోవుంటే ఆ పార్టీ కొమ్ము కాయడం, ఆ నాయకులకు అవసరమైన మూటలు సరఫరా చేయడం నేర్చుకొని పెద్దఎత్తున ప్రభుత్వ సొమ్మును మింగేస్తున్నాడు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు అదికారుల కాసుల కక్కుర్తి కన్నయ్యకు వరంగా మారింది. అక్రమంగా సంపాదిస్తున్నదానిలో అటు అధికారులకు, ఇటు నాయకులు వాటాలు పంచి అందర్నీ గుప్పిట్లో పెట్టుకొని కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన సందర్భం వుంది. తన పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఇటీవల రా రైస్ మిల్లుల సంఘానికి నాయకుడయ్యారు. ఆ హోదా కూడా కన్నయ్యకు బాగా కలిసి వచ్చింది. కన్నయ్య లాంటి పెద్దమిల్లర్ తమకు తోడుగా వుంటే తమకు న్యాయం జరగుతుందని నమ్మిన ఇతర మిల్లర్లకు తీవ్ర అన్యాయం జరిగిపోయింది. వారికి కూడా అందాల్సిన వడ్లు రాకుండాపోయాయి. మొత్తం సెంటర్లన్నీ కన్నయ్య గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. రారైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు కన్నయ్యను ప్రశ్నిస్తే ఓ మంత్రి తనకు బంధువని,తనకు ఆ మంత్రి అండదండలున్నాయని బెదిరిస్తున్నట్లు కూడా మిల్లర్లు చెబుతున్నారు. న్యాయంగా, ధర్మంగా వ్యాపారం చేసేంత వరకే బంధువైనా, బంధుగణమైనా, ఇతరులైనా కాని, బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడేవారికి నాయకుల అండదండలు కూడా వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ప్రతి జిల్లాలో ఇలాంటి కన్నయ్యలు పెద్దఎత్తున పుట్టుకొస్తారు. అధికారులే అలాంటి కన్నయ్యలను తయారు చేస్తారు. వారికి అండదండలందిస్తారు. అక్రమార్కులతో కలిసి సివిల్ సప్లయ్‌ని మరింత భ్రష్టుపట్టిస్తారు. జిల్లా స్ధాయిలో జాయింట్ కలెక్టర్లు ఏం చేస్తున్నారు. వారి ఆదేశాలతో సివిల్ సప్లయ్ అదికారులు ఏలా వ్యవహరిస్తున్నారు. కన్నయ్య లాంటి వారిని ఎలా వెనకేసుకొస్తున్నారు. బకాయిలు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా ఎలా దోచుకుంటున్నారు అనే విషయాలపై దృష్టిపెట్టాలి. స్వతంత్ర సంస్ధలు ఏర్పాటు చేసి డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ముక్కు పిండి బకాయిలు వసూలు చేయాలి. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల అవినీతి పరంపర, కన్నయ్య లాంటి వారి ఆటలకు అడ్డుకట్ట పడదు. ప్రభుత్వం కఠిన మైన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలి. కన్నయ్య లాంటి వారి వెనక వున్న అధికారులను గుర్తించాలి. వారిని కొలువుల్లో నుంచి తొలగించడమే కాకుండా వారి వారి అక్రమ సంపాదనలు గుర్తించి వసూలు చేయాలి. దానితోపాటు కన్నయ్య లాంటి వారి ఆస్ధులు జప్తు చేస్తే తప్ప బకాయిల చెల్లింపులు జరగవు.