ఆరోగ్య భారత్ మోడీ సర్కార్ లక్ష్యం

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

ఎంజీఎంలో “నషా ముక్త్ భారత్ అభియాన్” మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రం ప్రారంభం
వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్. ఆరోగ్య భారత్ నిర్మాణానికి మోడీ సర్కార్ పెద్ద పీట వేస్తోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వివరాల్లోకి వెళితే గురువారం వరంగల్ ఎంజీఎంలో నషా ముక్త్ భారత్ అభియాన్ మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గంట రవికుమార్ మాట్లాడుతూ, మోడీ సర్కార్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిధులు కేటాయిస్తోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం బాగుంటే దేశ ప్రగతి బాగుటుందని అందుకే ప్రధాని మోడీ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 41 మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో మన వరంగల్ కు ఒక కేంద్రం రావడం హర్షణీయమన్నారు. వరంగల్ జిల్లాలో బీజేపి ఎమ్మెల్యే, ఎంపీలు లేకున్నా, ప్రజల ఆరోగ్యం కోసం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే నినాదంతో నిధులు కేటాయిస్తున్నారని, ఇదీ ప్రజలు గమనించగలరని గంట రవికుమార్ చెప్పారు. గతంలో హృదయ్ పథకంలో గ్రేటర్ వరంగల్ ను అభివృద్ధి చేశారని, నేడు ఎంజీఎంలో కోట్ల రూపాయాలు వెచ్చించి మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, దీన్ని ఓరుగల్లు ప్రజలు గమనించాలని రవికుమార్ కోరారు. మద్యం, మాదక ద్రవ్యాల బాధితులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్ధేశంతోపాటు, ఆర్థిక బారం పడుకూదనే ఆలోచనతో ఈ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో మద్యం, మత్తుకు బానిసైలన వారికి కౌన్సెలింగ్ తో పాటు చికిత్స అందిచనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, ప్రధాన కార్యదర్శి బాకo హరిశంకర్, ఓబిసి మోర్చ అద్యక్షులు కందిమల్ల మహేష్, డివిజన్ ప్రెసిడెంట్ సుతారి గోపి జెట్లింగ్ కిషోర్ షా, అకినే సాగర్, చంద్రమోహన్, లక్ష్మణ్, బీజేపీ మంద శ్రీనివాస్, రఫీ, భరత్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *