
Army Jawan Assaulted
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ టోల్ బూత్ వద్ద ఆర్మీ జవాన్‌పై దాడి జరిగిన ఘటన సంచలనంగా మారింది.
రజపుత్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న కపిల్ కవాడ్, తన సెలవులు ముగించుకుని శ్రీనగర్‌లోని పోస్ట్‌కి వెళ్లేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో భుని టోల్ బూత్ వద్ద భారీగా ట్రాఫిక్ ఉండటంతో కపిల్ టోల్ సిబ్బందిని తన గ్రామం టోల్ మినహాయింపు పొందిన ప్రాంతంలో ఉందని చెప్పాడు. చిన్న వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారి, ఐదుగురు టోల్ సిబ్బంది కపిల్ మరియు అతని కజిన్‌పై దాడి చేశారు.
ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేసి, మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతున్నాయి. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టే సైనికుడికి ఇలాంటి అవమానం జరగడం చాలా దురదృష్టకరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.