`రాష్ట్ర నాయకుల్లారా ఇప్పటికైనా సిగ్గుపడండి?
`అసలు డిఫాల్టర్ లు మిల్లర్లా! పాలకులా?
`పాలకులను ప్రశ్నించలేని యూనియన్లు ఎందుకు?
`బకాయిల పేరుతో పెరుగుతున్న ఒత్తిళ్ళు?
`చిన్న మిల్లర్ “చితి”కి పోతున్నా యూనియన్ నాయకులు కదలరా?
`500 మంది కోసం 3000 మందికి ఉరితాళ్లు పేనుతారా?
`ఆమె ప్రాణం ఖరీదు.. పెండింగ్ లో వున్న మిల్లింగ్ చార్జీలు కాదా?
`ఈ పాపం యూనియన్ నాయకులది కాదా!
`పదేళ్లుగా మిల్లింగ్ ఛార్జిలను చెల్లించని పాలకులది కాదా?
`గత ప్రభుత్వం చేసిన పాపానికి మిల్లర్లు బలి కావాలా?
`మహిళా మిల్లర్ ఆత్మహత్యకు కారకులెవరు?
`పదేళ్లుగా మిల్లింగ్ చార్జీలు పాలకులు ఇవ్వకుంటే అడగరా?
`ఎవరి ప్రయోజనాల కోసం నాయకులయ్యారు?
`పెద్ద నాయకుల నిర్లక్షానికి చిన్న మిల్లర్లు ప్రాణం తీసుకోవాలా?
`పదేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై నోరేత్తరా?
`చిన్న మిల్లర్లను బలి చేస్తారా? వారి ప్రాణాలు మింగేస్తారా?
`చిన్న మిలర్ల మెడలో డిఫాల్టర్లని బోర్డు వేసి దొంగలను చేస్తారా?
`ప్రాణం తీసుకున్న ఆ “మహిళ మిల్లర” పాడే మోయడానికి అసలు మీరు ఎలా అర్హులవుతారు?
`రాష్ట్ర నాయకుల స్వార్థానికి పాడేనెక్కుతున్న మిల్లర్లు?
`బకాయిలు చెల్లిస్తే ఆమె ప్రాణం తెచ్చిస్తారా?
`కేసులు నమోదు చేస్తామనే అధికారులకు వాస్తవాలు తెలుసా?
`మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన మిల్లింగ్ బకాయిలు ఎప్పుడైనా చూసుకున్నారా?
`మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో నాయకులు?
`ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మాయం చేసిన గజదొంగలు ఎవరు?
`నాయకుల లెక్కల్లోని బొక్కలే చిన్న మిల్లర్ల పాలిట శాపాలు!
`నాయకుల బకాయిల బండారాలు బయట పడతాయానే నోరు మూసుకున్నారా?
`మిల్లు లేని వాడు మిలర్ల నాయకుడా?
`మిల్లు కిరాయికి ఇచ్చినవాడు అధ్యక్షుడై మిల్లర్ల హక్కులు కాపాడతాడా?
`నాయకులుగా చెలామణి అయ్యేందుకు వారికి సిగ్గు అనిపించడం లేదా?
`వారిని నాయకులుగా ఎంచుకోవడానికి మిల్లర్లకు బుద్ధి లేదా?
`మైనింగ్ మాఫియా కు పాలకుల అండదండలా?అన్నం పెట్టే మిల్లర్ల మెడకు బకాయిల గుది బండలా?
`పది సంవత్సరాల పెండింగ్ మిల్లింగ్ బకాయిలు అడగొద్దా?
`బకాయిలు చెల్లించమని చిన్న మిల్లర్లకు వేధింపులా?
హైదరాబాద్, నేటిధాత్రి:
సీత కష్టం సీతది..పీత కష్టం పీతది అని సామెత. అలాంటివే కొంత మంది చిన్న మిల్లర్ల పరిస్దితి. పైన పటారం లోన లొటారంలా వుంది. తెలంగాణలోని చిన్న మిల్లర్ల జీవితాలు పైకి కనిపించేంత గొప్పగా ఏమీ వుండవు. పైన సిల్స్ షర్టు వేసుకున్నా, లోపల చిరిగిన బనియన్ వెక్కిరిస్తూనే వుంటుంది. అది పైకి కనిపించనట్లే, చిన్న మిల్లర్లు ఎదుర్కొనే కష్టాలు ఎవరికీ కనిపించేవి కాదు. సహజంగా మిల్లర్లు అనగానే ధనవంతులు, భవంతులు, ఆడంuరాలు అని అందరూ అనుకుంటారు. కాని వాళ్లుపడే వేదన, కష్టం ఎవరికీ చెప్ప్పుకోరు. ఎవరికి చెప్ప్పుకున్నా తీరేవి కాదు. అందుకే వారి కష్టం, నష్టం ఎవరికీ చెప్ప్పుకోరు. అందుకే తెలంగాణలోని చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు. నలిగిపోతున్నారు. నానా తంటాలు పడుతున్నారు. యాతన పడుతున్నారు. గట్టెక్కే మార్గం లేక కొంత మంది ఉరితాళ్లు పేనుకుంటున్నారు. పరువు కోసం జీవితాలను త్యాగం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగింది. వారికి శత్రువులు ఎవరో కాదు. మర్రిచెట్టులా పాతుకుపోయిన పెద్ద మిల్లర్లు, కనికరం చూపని పాలకుల మూలంగా చిన్న మిల్లర్ల జీవితాలు ఆగమౌతున్నాయి. ఊపిరి తీసుకోలేనంత కష్టం వెళ్లదీస్తున్నారు. దినదిన గండంగా బతుకుతున్నారు. ఇటీవల ఓ మహిళా మిల్లర్ల ఆ కష్టాలను నుంచి బైటపడే మార్గం కనిపించక తనవు చాలించింది. అంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. వాళ్లు చేసిన పాపం లేదు. మోసం లేదు. కాని జీవితాలు బలి చేసుకోవాల్సి వస్తోంది. బలన్మరణాలను కోరుకోవాల్సి వస్తోంది. ప్రాణం తీసుకునేంత పుట్టెడు దుఖం కడుపులో వుంటే తప్ప ఎవరూ అంతటి కఠినమైన నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే చిన్న మిల్లర్ల గోస చూసేవారు లేరు. వారి గోడు వినిపించుకునే వారు లేరు. వారిని పట్టించుకునే నాధుడే కరువుయ్యాడు. అంతటి దౌర్భాగ్య స్దితిలో బతుకులీడుస్తున్నారు. వింటేనే కన్నీళ్లు ఆగడం లేదు. అలాంటి నరకం అనుభవిస్తున్న వారి జీవితాలు ఎంత ఆగమ్య గోచరంగా వున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ వారు చేసిన పాపం ఏమిటి? గత పది సంవత్సరాల కాýంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మిల్లింగ్, ట్రాన్స్‌పోర్టు ఇలా కొన్ని రకాల చార్జీలు అందడం లేదు. ఇదిగో వస్తాయి..అదిగో వస్తాయని పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వడ్లను తీసుకొని మిల్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి అందిస్తున్నారు. కాని వారికి రావాల్సిన చార్జీలు మాత్రం అందడం లేదు. అందుకే వారు ఆ చార్జీల కోసం చకోర పక్షులుగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లు క్రితం ప్రభుత్వం మారింది. ఇప్పటి ప్రభుత్వమైనా తమను ఆదుకుంటుంది. తమకు రావాల్సిన బకాయి చార్జీలు వస్తాయని చిన్న మిల్లర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా వాటి జాడ లేదు. చార్జీలు వచ్చింది లేదు. వస్తాయన్న నమ్మకం ఇప్పట్లో కనిపించడం లేదు. పైగా చిన్న మిల్లర్లు కొన్ని సార్లు తప్పని పరిస్తితుల్లో ప్రభుత్వానికి పెట్టాల్సిన బియ్యం పెట్టలేకపోయారు. ప్రభుత్వం నుంచి చార్జీలు రాపోవడంతో వాళ్లు అప్ప్పులు చేశారు. ఆ అప్ప్పులకు వడ్డీలు చెల్లించుకునే స్దితి కూడా లేకపోవడంతో అప్ప్పులు ఇచ్చిన వారితో వేధింపులు పెరుగుతున్న తరుణంలో ప్రభ్వుతం ఇచ్చిన వడ్లకు సరిపడ ధాన్యం పెట్టలేకపోయారు. ఇదొక్కటే మిల్లర్లు చేసిన పొరపాటు. ఆ పొరపాటు కూడా గ్రహపాటు అవుతుందని మిల్లర్లు అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వున్న ధాన్యం బకాయిలు ఎప్పటికైనా చెల్లించాల్సిందే. అయితే ఆ బకాయిలుపై కూడా ప్రభుత్వం 25శాతం అదనపు సుంకం విధించడంతో చిన్న మిల్లర్లు లబో దిబో మంటున్నారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు ఓ వైపు తమకు రావాల్సిన మిల్లింగ్ ఇతర చార్జీలు ఇవ్వడం లేదు. పైగా తామ బకాయిలు చెల్లించమంటూ అధికారులు వేదిస్తున్నారు. కేసులు నమోదు చేస్తామంటున్నారు. జైలు పాలు చేస్తామంటున్నారు. ఆస్దులు జప్తు చేస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి దారి కనిపించడం లేదు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పోలీసులు ఓ మిల్లర్ దంపతులను నేరస్ధులను అరెస్టులు చేసి మీడియా ముందు నిలబెట్టినట్లు నిలబెట్టడంతో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా మిల్లర్ మనస్తాపానికి గురయ్యారు. తమ పరిస్దితి కూడా అలాగే వుంటుందేమో అని భయపడ్డారు. ఇంత బతుకు బతికి, దొంగలుగా, నేరస్ధులుగా నిలబడాల్సి వస్తుందా? అని తనలో తానే కుమిలిపోతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో చిన్న మిల్లర్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వంతు కూడా అలాగే వస్తుందా అని భయపడుతున్నారు. ఇందుకు కారకులు పాలకులు కాదా? అది ఎవరైనా సరే గత పాలకులు ఎనమిది సంవత్సరాల పాటు బకాయి చార్జీలు చెల్లించలేదు. ఈ పాలకులు వచ్చి రెండేళ్లయినా వాటిని విడుదల చేయడం లేదు. దాంతో చిన్న మిల్లర్లంతా దిగులుపడుతున్నారు. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చిన్న మిల్లర్ల వున్న బకాయిలు మాత్రమే చూస్తున్నారు. కాని మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిల మీద దష్టిపెట్టడం లేదు. వాళ్ల uకాయిలు క్లియర్ చేస్తామని మాట ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చేదాని గురించి మాట్లాడకుండా, ప్రభుత్వానికి మిల్లర్లు ఇచ్చే దాని గురించే ప్రస్తావిస్తున్నారు. అదికారులు బెదిరిస్తున్నారు. తెలంగాణలో చిన్న మిల్లర్లు సుమారు 3000 మంది వుంటారు. ఆ 3000 మంది పరిస్దితి ఇదే విదంగా వుంది. వీళ్లను డిఫాల్డ్ మిల్లర్లు ముద్ర వేశారు. వారిని దొంగలుగా సమాజం చూపించే స్దితికి తెచ్చారు. కాని అసలు డిఫాల్టర్లు వీళ్లు కాదు. వీళ్ల uకాయిలు ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కాని మొత్తం 3500 మంది మిల్లర్లలో 500 మంది బడా మిల్లర్లు వున్నారు. అసలైన డిఫాల్డ్ మిల్లర్లంతా ఈ 500 మందిలోనే ఎక్కువగా వున్నారు. ఈ 500 మంది పెద్ద మిల్లర్లలో ఓ పది మంది మిల్లర్ల వున్న uకాయిల మొత్తంకూడా ఈ 3000 మంది చిన్న మిల్లర్ల uకాయిలు. చిన్న మిల్లర్ల సంఖ్య ఎక్కువగా వున్నప్పటికీ వారు చెల్లించే బకాయిలు వడ్లలో తాలంత కాదు. కాని తక్కువ మంది వున్న బడా మిల్లర్ల బకాయిలు కొండత. ప్రభుత్వ పెద్దలు, అదికారులు ఆ బడా మిల్లర్ల జోలికి వెళ్లరు. వారి బకాయిల ఊసెత్తరు. ఆ బడా మిల్లర్లు తప్పించుకునేందుకు ఈ చిన్న మిల్లర్లను ఎరగా వేస్తుంటారు. చిన్న మిల్లర్లను చిదిమేస్తున్నారు. వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ చిన్న మిల్లర్ల నాయకులు కూడా బడా మిల్లర్ల యజమానులే. ఈ చిన్న మిల్లర్ల పేరు చెప్పి రాజకీయం చేసే వాళ్లే.. ఈ చిన్న మిల్లర్ల సమస్యను ప్రబుత్వ పెద్దల దష్టికి తీసుకుపోరు. ప్రబుత్వం చిన్న మిల్లర్లను వేదిస్తుంటే చోద్యం చూస్తుంటారు. తమ మీదికి అదికారులు రాకుండా మాత్రం చూసుకుంటారు. దాంతో చిన్న మిల్లర్లే అదికారులకు టార్గెట్ అవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలంటూ చిన్న మిల్లర్ల మీద పడుతున్నారు. యూనియన్ నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్లు కనీసం ఒక్క శాతం చిన్న మిల్లర్ల కోసం పనిచేసినా వారికి ఈ కష్టాలు వచ్చేవి కాదు. పేరుకు మాత్రం మిల్లర్ల యూనియన్ అసోసియేషన్లకు నాయకులు. కాని చిన్న మిల్లర్ల సమస్యలు పట్టించుకోరు. చిన్న మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్ చార్జీలు ఇప్పించరు. తమ తోటి మిల్లర్ల సమస్యలు పరిష్కారం కోసం కషి చేయని నాయకులు ఎందకు? పాలకుల దష్టికి చిన్న మిల్లర్ల సమస్యలు తీసుకెళ్లలేనప్ప్పుడు ఆ నాయకులకు పదవులు ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం నాయకులయ్యారు. ఓ మహిళా మిల్లర్ల బలన్మరణానికి గురైతే కూడా పట్టించుకునే తీరిక లేదా? లేక మీకు మనసు కరుగుతలేదా? పెద్ద నాయకుల నిర్లక్ష్యానికి చిన్న మిల్లర్లు ప్రాణాలు తీసుకోవాలా? ప్రబుత్వం నుంచి చిన్న మిల్లర్లకు రావాల్సిన బకాయిలపై నాయకులు నోరెత్తరా? చిన్న మిల్లర్లను బలి చేస్తారా? వారి ప్రాణాలు మింగేస్తారా? చిన్న చిన్న మిల్లర్లను డిఫాల్లర్లని ముద్రలు వేసి వారిని దొంగలను చేస్తారా? రాష్ట్ర నాయకులు స్వార్ధానికి చిన్న మిల్లర్లు ప్రాణాలు బలి చేసుకుంటున్నారు. అయినా మిల్లే లేని వ్యక్తులు మిల్లర్ల యూనియన్‌కు నాయకులు కావడమేమిటి? తన మిల్లును కిరాయికి ఇచ్చిన వ్యక్తి మిల్లర్ల హక్కులు కాపాడుతారన్న నమ్మకమేమిటి? నాయకులుగా అలాంటి వారిని ఎన్నుకునేందుకు చిన్న మిల్లర్లకు కూడా ఇంగితం లేకుండాపోయిందా? ఇప్ప్పుడు సమస్య ఉరితాడులా వేలాడుతుంటే కూడా మిల్లర్లలో చైతన్యం రాదా???
