సాగు నీరు కోసం రోడ్డు ఎక్కిన రైతులు….
ఖమ్మం కు నీటి తరలింపు వల్లే సమస్య అంటూ ఆందోళన…..
అంబాల-పరకాల రహదారి పై ధర్నా…వంటా వార్పు…
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)ఆరు కాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక అన్నదాతల ఆక్రందన అరణ్యరోధకంగా మారనుందా?జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననిపిస్తుంది.హన్మకొండ
జిల్లా కమలాపూర్ మండలం లోని పలు గ్రామాల రైతులకు సాగు నీరు లభించక గత కొద్ది రోజులుగా మంత్రులు, అధికార పార్టీ నాయకుల దృష్టికి తమ సాగు నీటి సమస్యను తీసికెళ్ళి మార్గం చూపి,పొలాలకు నీరు అందించాలని పలు మార్లు వేడుకున్నారు.ఆ సందర్భంగా రైతులకు వారిచ్చిన హామీ నీటి మూటేనని తేలిపోయింది.ఖమ్మం జిల్లాకు నీటిని తరలించడం తమ సమస్య తీవ్రతరం అవుతున్నట్లు గుర్తించిన రైతులు ఆందోళన బాట పట్టారు.పంటలకు నీరు అందక,అధికార పార్టీ హామీ హామీ గానే మిగిలిపోవడం,పంటలు ఎండిపోవడం చూస్తున్న రైతులు,దిక్కుతోచని పరిస్థితుల్లో మండలం లోని గూడూరు,అంబాల,శ్రీ రాములపల్లీ తదితర చివరి అయ కట్టు గ్రామాల రైతులు సోమవారం పరకాల..హన్మకొండ ప్రధాన రహదారి పై అంబాల వద్ద రాస్తా రోకో,ధర్నా,వంటా వార్పు నిర్వహించారు.అధికారులు,ప్రజా ప్రతినిధులు,అధికార పార్టీ నాయకులు తక్షణం స్పందించి,చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.పోలీస్ అధికారుల తో పాటు సంబంధిత అధికారుల హామీతో ధర్నా విరమించారు.